NTR: సైమా 2023 సెలబ్రేషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్(NTR) కుటుంబ సమేతంగా దుబాయ్ కు వెళ్లాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుక దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆవార్డుల వేడుకలు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. నిన్న రాత్రి కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రాబాబు అరెస్టయిన తర్వాత ఆ అంశంపై తారక్ ఇంత వరకు స్పందించలేదు. దీంతో, ఆయనపై టీడీపీ శ్రేణులతో పాటు పలువురు సినిమా సెలబ్రేటీలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన తారక్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఏమైనా మాట్లాడతారా? అని ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు చాలా కాలంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. పూర్తి స్థాయిలో తన దృష్టిని సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..NTR: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తారక్.. చంద్రబాబు అరెస్ట్ పై ఏమైనా మాట్లాడతారా..?
సైమా 2023 సెలబ్రేషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్(NTR) కుటుంబ సమేతంగా దుబాయ్ కు వెళ్లి నిన్న రాత్రి తిరిగి వచ్చాడు. కాగా, టీడీపీ అధినేత చంద్రాబాబు అరెస్టై 10 రోజులు గడుస్తున్న ఆ అంశంపై తారక్ ఇంత వరకు స్పందించలేదు. దీంతో, ఆయనపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు తిరిగొచ్చిన తారక్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఏమైనా మాట్లాడతారా? అని ఎదురు చూస్తున్నారు.

Translate this News:














