తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. వారితోపాటు ఎన్టీఆర్తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబం.. ఎందుకంటే..!
నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

Translate this News:











