SC Launches Handbook to Combat Gender Stereotype: లింగ వివక్ష, అసమానతలను సూచించే పదాలను ఉపయోగించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఒక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. వేధింపులు, వేశ్య, పెళ్లికాని తల్లి, వ్యవహారం, గృహిణి (Harassment, Prostitute, Unwed Mother, Affair, Housewife)వంటి పదాలు చట్టపరమైన పదజాలం నుండి తొలగించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన హ్యాండ్‌బుక్‌లో న్యాయపరమైన చర్చలు, ఆదేశాలు, తీర్పులలో ఉపయోగించడానికి ప్రత్యామ్నాయ పదాలు, ఇడియమ్‌లను సూచించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని (Article 370) తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రారంభించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌బుక్ పేరు – ‘జెండర్ స్టీరియోటైప్స్పై పోరాటానికి సంబంధించిన హ్యాండ్‌బుక్'(HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES)
పూర్తిగా చదవండి..CJI: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!!
న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు.

Translate this News:











