పంచాయతీలకు సర్పంచ్లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నిన్న (ఆదివారం) నోటిఫికేషన్ను జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. ఇవాళ్టి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 10వ తేదీ సా. 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సా. 5 గంటల్లోగా తెలియజేయవచ్చు. 13న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలన చేస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజు మ.3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. 19న ఉ. 7 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మ.2 గంటల నుంచి కౌంటింగ్ జరిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఏదైనా కారణాలతో ఎన్నికలు నిలిచిపోతే ఈనెల 20న రీపోలింగ్ నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల స్వీకరణ.. పోలింగ్..ఫలితాలు అదేరోజు
ఏపీలో పంచాయతీలకు సర్పంచ్లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ను విదుదల చేసింది జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం నేడు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు.నేటి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చు.

Translate this News:











