IMD Issued Heavy Rain Alert: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం 115ఏళ్ల రికార్డుకు చేరువైంది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..IMD Issued Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న మేఘాలు..!!
తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Translate this News:












