నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలోకి ఎంటర్ అయినారు. ఈరోజు ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల నేతలూ ఇంపార్టెంట్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా యుద్ధం చేసేందుకు భారీగా ఆయుధాలు, మందు సామాగ్రి అవసరం ఉంది. దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ విషయం పక్కన పెడితే దీనికోసం కిమ్ ప్రయాణించిన రైలు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసారని చెప్పడంతో దాని స్పెషాలిటీతో ఏంటో అని ఆరాలు తీస్తున్నారు.
పూర్తిగా చదవండి..ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.

Translate this News:















