ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కిమ్ కలుస్తారని విశ్వసనీయ సమాచారం. కిమ్ పర్యటన వార్త రాగానే ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఆయుధాల ఒప్పందంపై పాశ్చాత్య దేశాల్లో ఆందోళనలు పెరిగాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, మందుగుండు సామగ్రి కర్మాగారాలకు బాధ్యత వహించే టాప్ ఆర్మీ అధికారులు కూడా కిమ్‌తో రష్యా చేరుకున్నారు. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ప్రకారం కిమ్ ఆదివారం తన ప్రైవేట్ రైలులో దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ నుండి అధికార పార్టీ, ప్రభుత్వం, సైనిక సభ్యులతో కలిసి బయలుదేరారు.
పూర్తిగా చదవండి..Kim Jong Un in Russia: వారిద్దరి భేటీతో…ఉక్రెయిన్ గుండెల్లో గుబులు..!!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాపర్యటనకు వెళ్లారు. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇద్దరు శక్తివంతమైన నాయకులు కలుస్తున్నారన్న వార్త ఉక్రెయిన్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. అటు ఇది పాశ్చాత్య దేశాలలో ఉద్రిక్తతను సృష్టించింది. ఇరు దేశాల నేతలు ఎప్పుడు భేటీ అవుతారు..ఎలాంటి అంశాలపై చర్చిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

Translate this News:











