తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లు స్కామ్ పార్టీలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఆ వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందో ఎన్నికల ఫలితాలు వచ్చాక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అర్దమవుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో ఎన్ని నాటకాలు ఆడినా తాము ప్రజలకు నిజం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Syed Zafar Islam: బీజేపీ గ్రాఫ్‌పై తప్పుడు ప్రచారం వద్దు
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యర్ జాఫర్ ఇస్లామ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏదో బీజేపీ పార్టీ స్థాయి ఏదో తెలుస్తుందన్నారు. ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Translate this News:











