వైద్యరంగం రోజురోజుకూ డెవలప్ అవుతోంది. ప్రతీ రోగానికీ కొత్త కొత్త మందులను, పద్ధతులనూ కనిపెడుతున్నారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మరీ చికిత్సను సులభతరం చేస్తున్నారు. తాజాగా డయాబెటీస్, ఒబెసిటీకి చికిత్సకు సంబంధించి ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు హైదరాబాద్ ఏఐజీ వైద్యులు. ప్రపంచంలోనే ఇది మొదటిది అని చెబుతున్నారు. డ్యుడెనో జెజునల్ బైపాస్ లైనర్ ఎండోస్కోపి ట్రీట్మెంట్ అని దీనికి ఏరు పెట్టారు. ఇదొక డివైజ్ బేస్డ్ ఎండోస్కోపిక్ ట్రీట్ మెంట్ అని చెబుతున్నారు ఏఐజీ హాస్పటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి. దీని లైవ్ ప్రొసీజర్ ను చూపించారు. చిన్న ప్రేగులో ఒక చిన్న పరికరాన్ని అమరుస్తారు. అది శరీరంలోని న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను సరిగ్గా ఉండేలా చూస్తుంది. దీని ద్వారా డయాబెటీస్ కంట్రోల్లో ఉండడమే కాకుండా ఒబెసిటీని కూడా నియంత్రిస్తుంది అని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..New treatment for diabetes:డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ
డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ చేశారు ఏఐజీ హాస్పటల్ వైద్యులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డివైజ్డ్ బేస్డ్ ఎండోస్కోపిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను బాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. డయాబెటీస్ తో పాటూ ఒబెసిటీని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.

Translate this News:











