India New Constitution Copy: కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదం చెలరేగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను అధికారికంగా కొత్త భవనంలోకి తరలించిన మరుసటి రోజు ప్రభుత్వం ఎంపీలకు రాజ్యాంగం ప్రతులను పంపిణీ చేసింది. అయితే, ఈ కాపీల్లో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేకపోవడం తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇది రాజ్యాంగంపై దాడి అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. అయితే, ఈ విమర్శలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ స్పందించారు. ఈ కాపీలలో రాజ్యంగ ప్రవేశ అసలైన ప్రతులు ఉన్నాయని వివరించారు. రాజ్యంగం ఆవిర్భవించినప్పుడు అందులో సోషలిస్టు, సెక్యూలర్ అనే పదాలు లేవని, 1976లో రాజ్యాంగంలోని 42వ సవరణలో ఈ పదాలను చేర్చారని ఆయన గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..New Constitution Copy: రాజ్యాంగం ప్రతుల్లో ‘సోషలిస్ట్, సెక్యూలర్’ పదాలు మిస్? వివరణ ఇచ్చిన మంత్రి..
కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదం చెలరేగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను అధికారికంగా కొత్త భవనంలోకి తరలించిన మరుసటి రోజు ప్రభుత్వం ఎంపీలకు రాజ్యాంగం ప్రతులను పంపిణీ చేసింది. అయితే, ఈ కాపీల్లో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేకపోవడం తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.

Translate this News:











