మూడేళ్ల క్రితం వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటికీ కరోనా కేసులు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి. కాకపోతే.. మొదట్లో ఉన్నంత ప్రభావం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయినప్పటికీ కూడా కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో జనంపై దాడి చేస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది రకాల వైరస్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ అనే ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కూడా చూడని.. ఎనిమిది రకాల వైరస్లను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో ఈ వైరస్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..అమ్మో.. మరో ఎనిమిది వైరస్లు.. మళ్లీ మహమ్మారి ముప్పు తప్పదా..
చైనాలోని హైనాన్ అనే ప్రాంతంలో ఎనిమిది రకాల కొత్త వైరస్లను గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా దాదాపు 700 ఎలుకల నుంచి నమూనాలు సేకరించగా.. ఈ 8 వైరస్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.

Translate this News:











