తమది ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ అనేక సార్లు చెప్పింది. సామాన్యులతో ఫ్రెండ్లీగా ఉంటామని చెబుతుంటోంది. అయితే హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla)లో జరిగిన ఓ ఘటన చూసిన తర్వాత నెటిజన్లు పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నారు. ఓ బస్సు డ్రైవర్ని కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ(Traffic CI) వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది. అతను జీడిమెట్ల సీఐ వెంకట్‌రెడ్డి(Venkat reddy). ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ని కాలితో తన్నాడు. ఇది చూసి అక్కడున్నవారు ముక్కున వేలు వేసుకున్నారు. ఇదేంటి సీఐ ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన వైపు అలానే చూశారు. ఎవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు.
పూర్తిగా చదవండి..Viral video: కాలితో తన్నాడు, చెవులు పిండి..చెంప చెళ్లుమనిపించాడు..జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ ఎందుకిలా చేశాడు?
వివాదాస్పదుడిగా పేరొందిన హైదరాబాద్ జీడిమెట్ల సీఐ వెంకట్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఐబీపీఎల్ చౌరస్తా వద్ద ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ని కాలితో తన్ని చెంప పగలగొట్టాడు. అతని చెవులు పిండాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెల మామూల కోసమే ఇలా చేశాడని మిగిలిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు ఆరోపిస్తుండగా.. సదరు డ్రైవర్ ర్యాష్‌గా బస్సు నడుపుతున్నాడని.. అడిగితే దురుసుగా సమాధానం చెప్పడంతోనే అలా చేయాల్సి వచ్చిందని వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

Translate this News:











