Nellore: గత కొద్ది నెలల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపిని విభేదించి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.అయితే రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లలో పదిమందికి పైగా కార్పొరేటర్లు ఆయన వెంటే నడిచారు. అందులో మేయర్ స్రవంతి కూడా ఒకరు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ప్రలోభాలు పెట్టి నా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటే నడిచారు మేయర్ స్రవంతి. ఎమ్మెల్యే కు నేను తోబుట్టువని,అవసరమైతే మేయర్ పదవినైనా వదులుకుంటాను కానీ.. ఎమ్మేల్యే కోటంరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని పలు పార్టీ మీటింగులు, మీడియా సమావేశాల్లో ఖరాకండిగా చెప్పారు.
పూర్తిగా చదవండి..Nellore: మేయర్ కు పెద్ద మొత్తం అందయా..!! అందుకే వైసీపీలోకి వెళ్లానున్నారా?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న మేయర్ స్రవంతి, జయవర్ధన్ తిరిగి వైసిపి గూటికి ఎందుకు వెళ్ళారు? అంత విశ్వాసంగా ఉన్న మేయర్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డికి దూరమవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసిపికి చెందిన రూఫ్ కుమార్ మేయర్ దంపతులను.. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపారు. వైసీపీలోనే కొనసాగుతామని.. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపుకి కృషి చేస్తామని చెప్పినట్లు సమాచారం. మేయర్ స్రవంతికి పెద్ద మొత్తంలో నజరానా కూడా అందినాయనే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి.

Translate this News:











