Government hospital: ప్రజారోగ్య వ్యవస్థను మెరుగు పర్చడానికి కొత్త కొత్త పథకాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వస్తూనే ఉంది. కాని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలు కాక తప్పడం లేదు. ఆపరేషన్ చేసి కడుపులో కత్తినో లేక గుడ్డ ముక్కనో మర్చిపోయే సంఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిండు ప్రాణాలను వారి నిర్లక్ష్యం మింగేస్తుంది. అయితే ఇలా సంఘటనలు ఎన్ని జరిగినా.. వైద్యుల్లో మాత్రం ఆ నిర్లక్ష్య ధోరణి పోవడం లేదు.
పూర్తిగా చదవండి..Government hospital: ప్రభుత్వాసుపత్రిలో బాలింత ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం..కడుపులో దూది మర్చిపోవడంతో..!!
ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా బాలింత కడుపులో దూది మర్చిపోవడంతో రెండు రోజుల నుంచి బాలింతకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. దీంతో అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు..

Translate this News:











