నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇండియా’ అనే పేరుకు బదులుగా ‘భారత్’ అనే పేరును బుక్స్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ మెరకు ప్యానెల్ ప్రదిపాదనను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కొత్తగా రానున్న NCERT పుస్తకాలు ‘ఇండియా’ ప్లేస్‌లో ‘భారత్’ను కలిగి ఉంటాయి. ఏడుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఈ సిఫార్సు చేసిందని కమిటీ చైర్పర్సన్ సీఐ ఐజాక్ తెలిపారు. ఇక ఛాప్టర్స్‌లో కూడా మార్పులు చేయాలని కూడా డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాఠ్యాంశాల నుంచి ‘ప్రాచీన చరిత్ర’ను తొలగించి.. దాని స్థానంలో ‘క్లాసికల్ హిస్టరీ’ని బోధించాలని మరొక సిఫార్సు చేశారు.
పూర్తిగా చదవండి..NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో ‘ఇండియా’ పేరు ఉండదు..!
ఇటీవల కాలంలో దేశం పేరు మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. NCERT తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'ఇండియా' అనే పేరు ఉండదు. Indiaకి బదులుగా 'భారత్' పేరును ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రింట్ కానున్న NCERT బుక్స్‌లో 'ఇండియా' ప్లేస్‌లో 'భారత్' పేరు ఉండనుంది.

Translate this News:











