Natty Kumar: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల నిర్మాత నట్టి కుమార్ విచారం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని. తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు.అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబునాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉంటే మంచిదని బావిస్తుంటాను.”
పూర్తిగా చదవండి..Natty Kumar: ఈ ఇండస్ట్రీకి ఏమైంది.. ఎవ్వరూ మాట్లాడరేంటి..!
చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు నట్టి కుమార్. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరం అన్నారాయన.

Translate this News:











