ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సీఎం జగన్ టార్గెట్గా నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. మూడు రాజధానులు అన్నారని… మూడు రాళ్ళు కూడా వెయ్యలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి పోలవరం ప్రాజెక్ట్ అయితే … జగన్ స్థాయి మురికి కాలువ అని నిప్పులు చెరిగారు లోకేశ్. జగన్ ది దరిద్రపు పాలనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడుతో పెట్టుకుంటే నాశనం అయిపోతారని.. తిరుమల కొండని దోచేశారంటూ ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: ‘జే’ టాక్స్ పేరుతో ప్రజల జేబులు దోచుకుంటున్నాడు.. జగన్ టార్గెట్గా లోకేశ్ ఫైర్!
టీటీడీ పాలకమండలిలో చాలా మంది అవినీతిపరులు ఉన్నారని.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మసి అయిపోతారని సీఎం జగన్పై విమర్శలు చేశారు నారా లోకేశ్. యువగళం పాదయాత్రలో భాగంగా జంగారెడ్డి గూడెంలో లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ చెప్పారు. న్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఇస్తామన్నారు.

Translate this News:











