టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎల్లుండి నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. పదిహేనురోజులుగా యాత్ర నిలిచిపోవడంతో దాని ప్రభావం పార్టీ మొత్తంపై పడుతోంది. ఓ వైపు చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయిన లోకేష్ తిరిగి రావాలని డిపైడ్ అయ్యారు. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వస్తోంది. దీని తర్వాత లోకేష్ ఏపీకి రానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఎల్లుండి రాత్రి 8.15 ని. లకు లోకేష్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని నారా లోకేష్ నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..nara lokesh:నారా లోకేష్ ను అరెస్టు చేస్తారా? పాదయాత్ర కొనసాగుతుందా..?
చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ తిరిగి రానున్నారు. దాంతో పాటూ ఎల్లుండి నుంచి యువగళం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తప్పదా..? ఏపీ రాగానే నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా.? లేదా ఆయన యువగళం పాదయాత్ర తిరిగి మొదలు అవుతందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Translate this News:











