టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మరోసారి ములాఖత్ అనంతరం ఆ పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ తప్ప చేయకపోయినా కూడా 50 రోజులుగా బంధించారని అన్నారు. ఇప్పటివరకు వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో.. తమ పార్టీకి డబ్బు అందాయనే ఆధారాలు చూపించలేదని ఆరోపించారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేవలం వ్యక్తిగత కక్షసాధింపుతోనే చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా జైల్లో పెట్టారని మండిపడ్డారు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబును చంపేయడం కోసం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ మహిళా మంత్రి అంటున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్
వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ చంద్రబాబును ప్రజల మధ్యకు రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయారని.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలంటూ సవాల్ చేశారు.

Translate this News:











