Nandamuri Balakrishna: టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu)ను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఆరోపించారు. స్కామ్‌ను జరిగినట్లు చూపించి, పొలిటికల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్ల భక్షక.. అవినీతి అర్చక..అంటూ జగన్‌పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎవరికీ భయపడేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు.
పూర్తిగా చదవండి..Nandamuri Balakrishna : ఎన్ని కేసులు పెట్టినా సరే.. తగ్గేదేలే.. వైసీపీపై బాలయ్య మాస్ కామెంట్స్..
ఎన్ని కేసులు పెట్టినా సరే..ఎవరికీ భయపడేది లేదని హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా..కనీసం చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ కేసును సృష్టించారని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబును జైలుకు పంపాలని పక్కా ప్లాన్ చేసి..స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుందని బాలకృష్ణ ధ్వజమెత్తారు.

Translate this News:











