స్కూల్ నుంచి ఇలా వచ్చి అలా కాసేపు బయటకు వెళ్లి గేమ్స్ ఆడుకోని వచ్చి.. డిన్నర్ చేసి ఇలా బెడ్ ఎక్కడం పాపం ఐపోయింది. మంచం ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోనికుండా నల్లులు చావగొడుతున్నాయి. కను రేప్ప ఇలా మూస్తే అలా మీద ఎక్కి రక్తాన్ని తాగుతున్నాయి. నల్లుల దెబ్బకు ఇళ్లలో ఉండలేని పరిస్థితులు దాపరించాయి. ఇటీవలి వారాల్లో బెడ్‌బగ్(నల్లుల)లు ఫ్రాన్స్‌లో ఒక వివాదాస్పద రాజకీయ సమస్యగా మారాయి. రైళ్లు, పారిస్(Paris) మెట్రో, సినిమా థియేటర్లతో సహా ప్రదేశాలలో ఈ జీవుల వేధింపులను ప్రజలు భరించలేకపోతున్నారు.
పూర్తిగా చదవండి..Bed Bug: నిద్రపోగానే వచ్చి రక్తాన్ని తాగుతున్నాయి.. నల్లుల దెబ్బకు పారిపోతున్న ప్రజలు!
ఫ్రాన్స్‌పై నల్లులు దండయాత్ర చేస్తున్నాయి. మంచంపై పరుపుకింద నక్కి ఉంటున్న నల్లులు ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రతాపం చూపుతున్నాయి. స్కూల్స్‌లోని బల్లల కింద కూడా నల్లులు గూడు కట్టుకుంటున్నాయి. దీంతో కొన్ని స్కూల్స్‌కి ఇప్పటికే సెలవులు ప్రకటించారు.పెరుగుతున్న బెడ్‌బగ్ కేసుల సంఖ్యను పరిశీలించడానికి ఈ వారంలో అత్యవసర సమావేశాలను నిర్వహిస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది.

Translate this News:











