బీజేపీ లో (BJP) కష్టపడినవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపితమైందని త్రిపురా గవర్నర్ గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) అన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తనను గవర్నర్ గా నియమించినందుకు కాంగ్రెస్ కి కడుపుమంట అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. గవర్నర్లు వ్యవస్థ వద్దు అంటున్న కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిద్రపోయాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి తన నియామకం కొత్త బూస్ట్ అని అన్నారు. ఎన్నికలకోడ్ కు తన నియామకానికి సంబంధం లేదన్నారు. ఎన్నికలు తెలంగాణలో ఉన్నాయని.. తన నియామకం త్రిపురలో జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: కేసీఆర్పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?
Indrasena Reddy: నేను గవర్నర్ కావడం తెలంగాణ బీజేపీకి బూస్ట్: ఇంద్రసేనారెడ్డి
తెలంగాణలో బీజేపీకి తన నియామకం కొత్త బూస్ట్ అని త్రిపురా గవర్నర్ గా నియామకమైన ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎన్నికలకోడ్ కు తన నియామకానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Translate this News:











