Komatiredy Vs Kancharla: నల్గొండ జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP Komatireddy Venkatreddy) అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Nalgonda BRS MLA Kancharla Bhupalreddy) వర్గాలు బల ప్రదర్శనకు రెడీ అయ్యారు. ఈ రెండు వర్గాలు ఒకేసారి గణేశుడి నిమజ్జనానికి సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు,16 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు నల్లగొండ పట్టణంలో భారీగా మోహరించారు. ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా వెంటనే అదుపులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Komatiredy Vs Kancharla: నల్గొండలో హై టెన్షన్.. కోమటిరెడ్డి, కంచర్ల బల ప్రదర్శన !
నల్గొండలో హై టెన్షన్ నెలకొంది. ఇటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వర్గాలు బల ప్రదర్శన చేపట్టనున్నాయి. ఈ రెండు వర్గాలు ఒకేసారి గణేశుడి నిమర్జనానికి సిద్దమైయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Translate this News:











