ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాసేపట్లో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను (mallikarjun kharge) వీరేశం కలవనున్నారు. ఖర్గే సమక్షంలో వీరేశం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరేశం చేరికకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నకిరేకల్ టికెట్ దక్కకపోవడంతో వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పై స్పష్టమైన హామీ పొందిన తర్వాతనే ఆయన ఆ పార్టీలోకి చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇన్నాళ్లు వీరేశం చేరికను వ్యతిరేకించిన నకిరేకల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పూర్తిగా చదవండి..Big Breaking: కోమటిరెడ్డి గ్రీన్ సిగ్నల్.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం..

Translate this News:











