తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార, విపక్ష నేతలంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఈ సారి రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశం బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలకమర్తి లింగయ్యను చిత్తుగా ఓడిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన స్పందన లభిస్తుందని..బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించడం ఖాయమంటున్నారు వేముల వీరేశం.
పూర్తిగా చదవండి..Vemula Veeresham: లింగయ్య ఎట్ల గెలుస్తాడో చూస్తా.. వేముల వీరేశం ఫైరింగ్ ఇంటర్వ్యూ..!!
నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిలకమర్తి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని వేముల వీరేశం ఫైర్ అయ్యారు.ఆర్టీవీ ద్వారా చిలకమర్తికి ఛాలెంజ్ చేస్తున్న...నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్ మెంట్ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలి... లేదంటే ఆర్టీవీ డిబెట్ ఏర్పాటు చేస్తే చిలకమర్తి బాగోతం మొత్తం బయటపెడతానంటూ వేముల వీరేశం ఆర్టీవీకి ఫైరింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Translate this News:











