కాళేశ్వరంలో అడుగడుగునా అవినీతి చోటుచేసుకుందని నాగంజనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో 48 వేల కోట్లు అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఈ డబ్బుతోనే మేఘా కృష్ణారెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని విమర్శించారు.
”కృష్ణారెడ్డిని విడిచిపెట్టను. ఏసీబీకి ఫిర్యాదుచేస్తా. ఏసీబీ కోర్టులో కాగ్ నివేదికను ప్రవేశపెడతా” అన్నారు. 2004లో సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న కృష్ణారెడ్డి ఈ స్థాయికి ఎలా ఎదిగాడని ఆయన ప్రశ్నించారు.
మెగామేత రూ. 48వేల కోట్లు : కాళేశ్వరంలో అడుగడుగునా అవినీతి, నాగం జనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ సీనియర్ నేత నాగంజనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వతంత్రభారతదేశంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. మేఘా కృష్ణారెడ్డి తో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బాధ్యులని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతికి సాక్ష్యంగా కాగ్ నివేదికను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

Translate this News:











