Nagababu: ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ, కర్మ మరో మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుందని జనసేన నేత నాగబాబు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్నారు . చంద్రబాబు అరెస్ట్ తమ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పార్టీ నాయకులకు, జనసైనికులకు ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు . టీడీపీ, జనసేన పొత్తును 90శాతం మంది జనసైనికులు స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మాత్రం పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారన్నారు. అలాగే ఎవరు సీఎం అవ్వాలనే దాని కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఎవరు సీఎం అనేది కాలం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Nagababu: చంద్రబాబుకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు
ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ, కర్మ మరో మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుందని జనసేన నేత నాగబాబు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్నారు .

Translate this News:












