మల్కాజ్ గిరి, మెదక్, మేడ్చల్ సీట్లతో పాటు మరో పది సీట్లపై తాను దృష్టి సారించానని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీట్లలో బీఆర్ఎస్ ను ఓడించి తీరతానని తెలిపారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘వాడొక బఫూన్ మంత్రి.. కామన్ సెన్స్ లేదు’ అని మంత్రి మల్లారెడ్డిపై తిట్ల దండకం మొదలెట్టారు. మల్కాజ్ గిరిలో తాను ఏం చేశానో ప్రజలకు తెలుసునన్నారు. మల్కాజ్ గిరి ప్రజలను బీఆర్ఎస్ నాయకులు తక్కువ అంచనా వేస్తున్నారని, వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. గత ఎన్నికల్లో నేను 74వేల మెజారిటీతో గెలిచానని, అనంతరం నాలుగు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8000 మైనస్ ఓటింగ్ వచ్చిందన్నారు. 82వేల మైనస్ అంటే ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అర్థం చేసుకోవాలన్నారు.
పూర్తిగా చదవండి..Mynampalli Hanmanth Rao: ఆ 3 సీట్లలో బీఆర్ఎస్ ను ఓడిస్తా.. మైనంపల్లి సంచలన సవాల్
మల్కాజ్ గిరి, మెదక్, మేడ్చల్ తో పాటు మరో పది పదిహేను నియోజకవర్గాలపై తాను దృష్టి పెడుతున్నానని.. వీటన్నింటిలో బీఆర్ఎస్ ను ఓడిస్తానని మైనంపల్లి హన్మంతరావు సవాల్ చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ మంత్రుల పని దోచుకోవడమే తప్ప వేరేమీ లేదన్నారు. 2 ఎకరాలు కొనడం 10 ఎకరాలు కబ్జా చేయడమే వారికి తెలుసన్నారు. మల్లారెడ్డి కాలేజీలన్నీ కబ్జా చేసిన చెరువుల్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

Translate this News:











