మైనంపల్లి హన్మంతరావు ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కు రాజీనామా ఇచ్చేసిన మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళుతున్నారు. సీఎల్పీ బట్టి విక్రమార్కతో మధుయాష్కీ, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదరం రాజనరసింహ తదితరులు మైనంపల్లి ఇంటికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..mynampally:కాంగ్రెస్ లో చేరతా-మైనంపల్లి
రెండు టికెట్లు ఇస్తా అన్నారు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా అని చెబుతున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మైనంపల్లి హన్మంత్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.

Translate this News:











