Anand Mahindra Tweet on Double-deckers: ఈ మధ్య కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవలే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టగా.. తాజాగా తిరుపతిలో ఈ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డబుల్ డెక్కర్ బస్సు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి. 1937వ సంవత్సరంలో ముంబయి రోడ్లపైకి ఈ బస్సులు వచ్చాయి. అప్పటి నుంచి ఈ బస్సులు ముంబై (Mumbai) వాసులకు ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ముంబయి బృహన్ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ (BEST) రెడ్ డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ చూసుకుంటోంది. అయితే క్రమేణా ఈ బస్సులు సంఖ్య వాడకం తగ్గుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం వీటి వాడకాన్ని నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 1990లలో 900కు పైగా బస్సులు తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతం మూడు ఓపెన్ డబుల్ డెక్కర్ బస్సులతో సహా ఏడు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏసీ బస్సులను నిలిపివేయగా.. అక్టోబర్ 5 నుంచి ఓపెన్ బస్సులు కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Anand Mahindra: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు
ఈ మధ్య కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవలే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టగా.. తాజాగా తిరుపతిలో ఈ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డబుల్ డెక్కర్ బస్సు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి. 1937వ సంవత్సరంలో ముంబయి రోడ్లపైకి ఈ బస్సులు వచ్చాయి.

Translate this News:











