హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇటీవల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన నోరు పారేసుకున్నారు. “చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు. ఇక సీఎం జగనే. ఆయనను ఎదిరించే నాయకులు కూడా లేరు. పవన్ కొన్ని రోజులు రాజకీయాలంటూ ఊగుతాడు. ఆ తరువాత సినిమాలు అంటూ వెళ్లిపోతాడు” అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యనించారు.
పూర్తిగా చదవండి..Gorantla Madhav: నేను అన్నది ‘చంద్రబాబు చస్తాడని’ కాదు.. క్లారిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్
2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ అన్న వ్యాఖ్యల పట్ల టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తన వ్యాఖ్యల పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు.

Translate this News:











