Mothkupally Narasimhalu Meet DK Shiva Kumar: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు(Mothkupally Narasimhalu) కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచులు. బీఆర్ఎస్(BRS) పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల వ్యవహారాలను చూసుకుంటున్న డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, హైదరాబాద్‌కు వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తానని మోత్కుపల్లి తెలిపారు.
పూర్తిగా చదవండి..Motkupalli Meets DK Shivakumar: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి భేటీ.. లైన్ క్లియర్ అయినట్లేనా?
బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.

Translate this News:











