పిల్లలే తమ సర్వస్వమని బతుకుతూంటారు తల్లిదండ్రులు. వారి కోసం ఎంతకష్టమైన పడతారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో ప్లాన్ చేస్తూంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తూంటారు. అందులోనూ వారి పెళ్లి అలా చేయాలి.. ఇలా చేయాలని కలలు కనని పేరెంట్స్ ఉండరు. కట్ చేస్తే.. ఇటు పిల్లలేమో ప్రేమ అంటూ దాని వెంటపడి.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూంటారు. ప్రేమ మోజులో పడి అమ్మాయిలు ఇళ్లు వదిలి వెళ్లిపోతే.. తల్లిదండ్రులు మనసు ఎంత క్షోభకు గురవుతుంది? వారి బాధ వర్ణణాతీతమనే చెప్పాలి. కొందరైతే దీన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ తల్లి కూడా కూతురి ప్రేమ కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.
పూర్తిగా చదవండి..విజయవాడలో దారుణం.. కూతురు ప్రేమకి.. తల్లి బలి!!
విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Translate this News:











