Powerful Magnitude Earthquake Hits Morocco: ఆఫ్రికన్ దేశం మొరాకోలో తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల కారణంగా ఇక్కడ 300 మందికి పైగా మరణించారు. 153 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. శిథిలాల నుంచి ప్రజలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఈ శక్తివంతమైన భూకంపం వచ్చింది. అట్లాస్ పర్వతాలలో ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్ట్ అయిన ఔకైమెడెన్కు పశ్చిమాన 56.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. బలమైన భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
పూర్తిగా చదవండి..Morocco Earthquake: మొరాకో భారీ భూకంపం. 300 దాటిన మృతుల సంఖ్య!
మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల కనీసం 300 మంది మరణించినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం కారణంగా భవనాలకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ కోతలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా మొరాకో మీడియా పేర్కొంది. ఇక ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

Translate this News:











