వచ్చే నెలలో జరిగే జీ20 సదస్సు కోసం ఇప్పటి నుంచే నాకాబందీ నిర్వహిచడం ఏంటని కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధిస్తూ.. వాహనాలను తనిఖీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అంతే కాకుండా కొన్ని కార్యాలయాలను సైతం మూసివేయించారని ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యత వహిస్తున్నారని అత్యుత్సాహంతో వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. మోడీ జీ20 లోగోగా పువ్వు గుర్తు పెట్టి సదస్సును రాజకీయంగా వాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సదస్సులను సైతం రాజకీయంగా వాడుకుంటున్న మోడీకి ఇది రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: జీ20 సదస్సును మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారు
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ20 సదస్సును ప్రధాని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీనే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అల్లర్లను ఎందుకు నియంత్రించలేక పోతున్నారని నారాయణ ప్రశ్నించారు.

Translate this News:











