బీఆర్ఎస్ అధిష్ఠానం దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో పలు చోట్ల అసమ్మతి నేతలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2018లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్ యాదవ్‌పై.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో నారాయణ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా జైపాల్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై నారాయణ రెడ్డి మండిపడ్డారు. 2018లో జైపాల్ యాదవ్ గెలుపు కోసం పనిచేశామని.. కానీ చివరికి తననే దూరం పెట్టారని అందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. జైపాల్ యాదవ్‌ను తాను ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగించలేదని.. ఆయనే తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బయట తిరగకూడదని.. ఎక్కడికీ రాకూడదని తనతో చెబుతుండేవాడని అన్నారు. జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదని.. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. నియోజకవర్గలో జైపాల్ యాదవ్ ఎలాంటి అభివృద్ధి చేయకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: నియోజవర్గానికి ఏం చేశాడని మళ్లీ టికెట్ ఇచ్చారు.. జైపాల్ యాదవ్‌పై కసిరెడ్డి ఫైర్
బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా జైపాల్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. 2018లో జైపాల్ యాదవ్ గెలుపు కోసం పనిచేశామని.. కానీ చివరికి తననే దూరం పెట్టారని అందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకున్నా అధిష్ఠానం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చిందని ఆరోపించారు.

Translate this News:











