MLA Raghunandan Rao: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ దుయ్యబట్టారు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. తనను గెలిపించిన రెండున్నర సంవత్సరాల్లో దుబ్బాక రూపురేఖలు మార్చానని ఆయన వెల్లడించారు. హరీష్ రావు పొద్దున లేస్తే అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఏం చేస్తాడంటూ దుయ్యబట్టారు. దుబ్బాక లో నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..మార్పు కోసం ఈ సారి అవకాశం ఇవ్వండీ..!!
నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు కానీ, కేసీఆర్ ఇంట్లో అందరికీ కొలువులే అంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రశ్నించకపోతే దోచుకునేవారిదే రాజ్యం అవుతుందని బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మంచి కోసం, మార్పు కోసం ఈ సారి బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వండంటూ ఎమ్మెల్యే రఘునందన్ అభ్యర్థించారు.

Translate this News:











