Chandrayaan 3: ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 04 నిమిషాలు.. ఈ సమయం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. జాబిల్లీ ఒడిలోకి చంద్రయాన్-3 చేరే క్షణాలు ఎప్పుడు వస్తాయా అని అంతా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది తమ షెడ్యూల్‌ని కూడా మార్చుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. దేశ ప్రజలు మొత్తం ఒకే తాటికి పైకి రానున్న గడియలకు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలవగా.. ఆఫీస్‌ల్లో, యూనివర్శిటీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు చంద్రయాన్-3 ప్రయోగం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తున్నాయి సంస్థలు. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ తర్వాత ఇస్రో సైంటిస్టులు వెనక్కి తగ్గలేదు.. బౌన్స్ బ్యాక్ అంటే ఏంటో చూపించేందుకు చంద్రయన్-3 కోసం కష్టపడ్డారు. దేశాన్ని గర్వించేలా చేసేందుకు సైంటిస్టుల పడ్డ కష్టం గురించి సోషల్‌మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో “PIB India” తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను షేర్ చేసింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: ‘ది బెస్ట్ క్లైమాక్స్‌కి కౌంట్‌డౌన్’.. సైంటిస్టుల కష్టాన్ని కళ్లకు కట్టే వీడియో!
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని 140 కోట్ల భారతీయులు అందరి దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. చంద్రయాన్-3 మేకింగ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియోని "PIB India" ట్వీట్ చేసింది. అటు చంద్రునిపై పరిస్థితి సరిగా లేకుంటే, ల్యాండింగ్ ఆగస్టు 27 వరకు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

Translate this News:











