జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి ఘాటు విమర్శలు చేశారు. రిషికొండపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. నిబంధనలు అతిక్రమించకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తుంటే ప్రతిపక్షాల బాధేంటి అని మండిపడ్డారు. సీఎం భద్రత విషయం దృష్ట్యా ఎక్కడుండాలో ఓ ఉన్నత కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అది నిర్ణయించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. కొండలపై భవనాలు ఎందుకు కట్టకూడదు.. గీతం వర్సిటీ భూములపై ఎందుకు మాట్లాడడం లేదు అంటూ పవన్‌ను ప్రశ్నించారు. విశాఖను దోచుకున్నది టీడీపీ నేతలేనంటూ ఆమె ఆరోపించారు.
పూర్తిగా చదవండి..అప్పుడు ఏం చేశావ్.. పవన్ కల్యాణ్‌పై రోజా ఫైర్
రిషికొండపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. నిబంధనలు అతిక్రమించకుండా నిర్మాణాలు చేస్తుంటే ప్రతిపక్షాల బాధేంటి అని మండిపడ్డారు.

Translate this News:











