Telangana Minister KTR: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) మరోసారి తీవ్రంగా స్పందించారు. కేంద్రం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటాయనేది వివరిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ గ్రాఫ్ విడుదల చేసింది. దీనిని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. ఇదే నిజమైతే ప్రజా సంగ్రామం తప్పదంటూ క్యాప్షన్ పెట్టారు. ‘ఈ డీలిమిటేషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న సంఖ్యలు సరైనవే అయితే.. మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజా ఉద్యమానికి దారి తీస్తుంది. భారతీయ పౌరులుగా, దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రా ప్రతినిథులుగా గర్విస్తున్నాం. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై ప్రజల గొంతుకను, ప్రాతినిథ్యాన్ని అణిచివేస్తామంటే చూస్తూ మౌన ప్రేక్షకులుగా ఊరుకోబోం. ఈ విషయంలో పునరాలోచన చేస్తారని, ఢిల్లీ దీనిని గమనిస్తుందిన విశ్వసిస్తున్నాను.’ అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Minister KTR:లోక్‌సభ సీట్లు తగ్గితే ఊరుకునేది లేదు.. లెక్కలు చూపుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్..
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన లెక్కలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. అదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని, ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

Translate this News:











