Telangana Minister KTR: మంత్రి కేటీఆర్.. అనగానే క్లాస్, మాస్ కలగలిపిన అచ్చమైన తెలంగాణ పొలిటిషన్ అని అనిపిస్తుంటుంది. ఆయన మాటలు, ఆయన ఆహార్యం, ఆయనకున్న జ్ఞానం.. అనన్యసామాన్యం. ఆయన వాక్చాతుర్యానికి యావత్ దేశమే ఫిదా అయిపోతుంది. ఆయనలోని విషయ పరిజ్ఞానానికి యావత్ ప్రపంచమే సలాం కొట్టింది. ఇక ఆయన ప్రజలతో మమేకయ్యే విధానానికి ఫిదా అయిపోయి జనాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా రామన్నా అని పిలుచుకుంటారు. ఆయన నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడుతుంటే.. మంచి స్నేహితుడు, ఒక సోదరుడు, ఒక మెంటార్ మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే.. ఆయన అభిమానులు ఎక్కువ. పెద్దలు, యువకులే కాదు.. పిల్లల్లోనూ ఆయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ.
పూర్తిగా చదవండి..Minister KTR: అమ్మ గురించి అడిగితే హౌస్ వైఫ్ అని చెప్పిన విద్యార్థి.. కేటీఆర్ రిప్లై చూస్తే ఫిదా అయిపోతారు..!
సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో కలిసి కూర్చుని తింటూ సరదాగా కబుర్లు చెప్పారు. తల్లిదండ్రులు ఏం చేస్తారని ప్రశ్నించగా.. తండ్రి జాబ్ చేస్తారని, అమ్మ ఏమీ చేయదని స్టూడెంట్ బదులిచ్చాడు. దానికి మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ హత్తుకుంటుంది. 'అమ్మను హౌస్ వైఫ్ అని ఎప్పుడూ అనకండి. అమ్మ మీ అందరినీ నడిపిస్తుంది. అసలు మీరందరూ బాగున్నారంటే దానికి కారణం అమ్మ. అమ్మ ఏమీ చేయదని ఎప్పుడు చెప్పకండి.' అంటూ విద్యార్థులకు చెప్పారు మంత్రి.

Translate this News:











