Minister KTR: తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth Reddy) ఇప్పటికే జైల్లోనే ఉండేవాడని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ(Telangana) ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని.. దాంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని.. సోనియా గాంధీని బలిదేవత అని అన్నది నాడు రేవంత్ రెడ్డేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana: అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో జైలుకు వెళ్లేవాడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిపైనే తాము ఫోకస్ పెట్టామన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఆకాంక్షలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. నాడు సోనియాను బలిదేవత అన్నది రేవంతే అని గుర్తు చేశారు కేటీఆర్. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అని పేర్కొన్నారు. అది కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు.

Translate this News:











