ఏపీ మంత్రి జోగి రమేష్ వ్యక్తగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ సూసైడ్ లెటర్ కలకలం రేపిన విషయం తెలసిందే. అవనిగడ్డ సమీపంలోని అంబటి బ్రాహ్మణయ్య వారధి వద్ద ఆదినారాయణ బైక్, వస్తువులను పోలీసులు గుర్తించారు. ముత్రాస్పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ దొరికింది. చనిపోతున్నట్లు అందరిని నమ్మించి ఆదినారాయణ పరారైయ్యాడు. సూసైడ్ నోట్లో సాధ్యమైనంతవరకు నా బాడీ దొరక్కుండా చనిపోతాను అంటూ ఆదినారాయణ రాశాడు. కాగా.. ఆదినారాయణ కోసం ఎన్డీఆర్ఎఫ్, పెడన, కోడూరులో రెండు రోజులు పోలీసులు తీవ్ర గాలింపు చేశారు. గాలింపు చర్యల్లో మృతదేహం కనబడకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో అదిరిపోయిన ట్విస్ట్ దొరికింది. చిన్నాపురం సిసి ఫుటేజ్‌లో ద్విచక్ర వాహనానికి బ్యాగ్ తగిలించుకుంటూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటూ ఆదినారాయణ వచ్చాడు. ద్విచక్ర వాహనాన్ని ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గర పెట్టి చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌ను ఆదినారాయణ రాశాడు.
పూర్తిగా చదవండి..Minister Jogi Ramesh: ఏపీ మంత్రి పీఏ మాయం.. చనిపోయినట్లు నమ్మించి.. ఏం చేశాడంటే..?
మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో పెద్ద ట్విస్ట్ దొరికింది. ఆదినారాయణ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. ఆదినారాయణ చనిపోలేదని, చనిపోతున్నట్లు అందరు నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Translate this News:











