Minister Harish Rao: కాంగ్రెస్ విజయ భేరి సభపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభ ఆసాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని విమర్శించారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణల కోసమే సభను ఏర్పాటు చేసినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ విజయ భేరి సభలో ఆ పార్టీ నేతలు ప్రకటించిన గ్యారెంటీలు గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా’ అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. పైగా వారు చెప్పిన గ్యారెంటీలు అన్నీ కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Minister Harish Rao: అవన్నీ వారంటీ లేని గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్
కాంగ్రెస్ విజయ భేరి సభపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభ ఆసాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని విమర్శించారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణల కోసమే సభను ఏర్పాటు చేసినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు.

Translate this News:











