ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తలచుకుంటే రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో పెట్టేవారని అన్నారు. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదని వ్యాఖ్యానించారు. ‘‘ పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా?. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు. ఇక్కడ అలా లేదు అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచే విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నామని.. ఎన్ని ట్రిక్‌లు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు
ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని పేర్కొన్నారు.

Translate this News:











