తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పారిపాలన సాగుతున్న ఈ సమయంలో ఢిల్లీ ముసుగులో బీజేపీ-కాంగ్రెస్ ఏపీలో తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్- బీజేపీలు ఇద్దరు కలిసే అభ్యర్థులను నిలబెడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ భీపాంలు బీజేపీ ఆఫీస్‌లో.. కాంగ్రెస్ ఆఫీస్‌లో బీజేపీ భీపామ్ లు తయారు అవుతున్నాయని గంగుల ఆరోపించారు. కేసీఆర్ పాలనలో యువత, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: తెలంగాణను ఏపీలో కలిపేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర.. మంత్రి గంగుల సంచలన ఆరోపణలు
మూడుసార్లు గెలిచాను.. నాలుగో సారి కూడా ప్రజల ఆశీస్సులతో మళ్ళీ గెలుస్తాను. సీఎం కేటీఆర్ పరిపాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయన్నారు. కరీంనగర్లో పర్యటించిన ఆయన బీజేపీ- కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Translate this News:











