Ambati: చంద్రబాబు భార్య భువనేశ్వరి, నారా లోకేష్ లపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, వ్యవస్థలను మానేజ్ చేసీ ఇక్కడి వరకు వచ్చారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ తో నిజం గెలుస్తుందని..ఇక హైకోర్ట్ లో నిజం గెలిచిందని..తప్పకుండా సుప్రీంకోర్ట్ లోనూ నిజం గెలుస్తుందన్నారు మంత్రి అంబటి. ఈ క్రమంలోనే.. 17ఎ గురించి ఎందుకు అంత పట్టుబడుతున్నారని టీడీపీ పై మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబును అరెస్ట్ నుండి తప్పించాలని అంతమంది లాయర్స్ ప్రయత్నస్తున్నా ఎందుకు నిజం గెలవడం లేదని ప్రశ్నించారు?. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారు అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు.
పూర్తిగా చదవండి..పవన్ రాజకీయాలకు అన్ ఫిట్ : మంత్రి అంబటి
అసలు టీడీపీ భవిష్యత్ కే గ్యారెంటీ లేదు..ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ సభలు ఎందుకని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారని అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అంటూ దుయ్యబట్టారు.

Translate this News:











