Meri Maati Mera Desh: దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడినుంచి.. ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్‌లోని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు ఈ మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగింది. రామచందర్ రావు నివాసం దగ్గర వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించారు. రామచందర్‌రావు త్యాగాన్ని, వారి స్ఫూర్తిని, పోరాటాన్ని,సేవల్ని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Goshamahal: భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి.. మహానీయుల త్యాగల్ని స్మరించుకునేలా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు.

Translate this News:











