Mental Health: అన్నిటికంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం.. శారీరక ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కొన్ని రోజులకు అంతా సెట్ అవుతుంది. కానీ మానసిక సమస్యలు జీవితకాలం ఉంటాయి.. వాటిని స్టార్టింగ్లోనే ఎండ్ చేయడానికి ట్రై చేయాలి.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువకులకు మెంటల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సైకాలజిస్టుల ప్రకారం “యుక్తవయస్సులో ఉన్న మానసిక ఆరోగ్య రుగ్మతలలో దాదాపు సగం వరకు 14 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి, అయితే చాలా సందర్భాలలో వాటిని గుర్తించరు, చికిత్స చేయరు”.
మానసిక ఆరోగ్య సమస్యాలకు ప్రమాద కారణాలేంటి?
Mental Health: నిద్ర లేదా ఆహారపు అలవాట్లు మారాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, నిద్ర లేదా ఆహారపు అలవాట్లను పదేపదే మార్చుకోవడం మానసిక సమస్యలను పెంచుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రియమైన వ్యక్తి మరణం లేదా విడాకులు లాంటి ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులకు మెంటల్ హెల్త్ లేకుండా చేస్తాయి. ఇటివలి కాలంలో యువకుల్లో మానసిక సమస్యలు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

Translate this News:











