Chiranjeevi ‘Mega 156’ Movie: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టుగానే కల్యాణ్ కృష్ణ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పక్కనపెట్టారు. భోళాశంకర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఒకటి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో,మరొకటి బింబిసార ఫేమ్ వశిష్ఠతో. మెగా 156గా కళ్యాణ్ కృష్ణతో రాగా.. మెగా 157గా వశిష్ఠ సినిమా రాబోతుందని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత వశిష్ఠ (Vassishta) సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్, రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయే తప్ప కల్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు. దీంతో కల్యాణ్ కృష్ణ సినిమాను చిరు పక్కనపెట్టారనే ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారమే నిజమైంది. దసరా పండగా సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు వంశీ తో మూవీ తీస్తున్న మేకర్స్. గ్రాఫిక్స్ తో చేసిన ఆయుధమున్న పోస్టర్ను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Mega 156 Movie: బింబిసార డైరెక్టర్ తో మెగా 156 మూవీ
భోళా శంకర్ తర్వాత బింబిసార ఫేమ్ వశిష్టతో సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని గ్రాఫిక్స్ తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ చేశారు. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Translate this News:











